The Cyberabad Police announced a slew of measures as part of a crackdown on spas and massage parlours operating within its jurisdiction in the IT corridor of Hyderabad.
స్పాలకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య హెచ్చరికలు జారీ చేశారు. స్పాల్లో కండోమ్స్ కనిపిస్తే వాటిని మూసేస్తామని హెచ్చరించారు. బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సైబరాబాద్ పరిధిలోని బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు, మేనేజర్లతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో మసాజ్ సెంటర్లు, పార్లర్లలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తుండడం ఆందోళనకరమని సందీప్ శాండిల్య అన్నారు.
మసాజ్ సెంటర్లు నిర్వహించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నియమ నిబంధనలను తప్పక పాటించాలని సందీప్ శాండిల్య అన్నారు. మసాజ్ సెంటర్లను మసాజ్ సెంటర్లుగానే కొనసాగించాలని, వీటి ముసుగులో వ్యభిచారం, చట్ట వ్యతికేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరిత్యా నేరమని చెప్పారు.
స్పాలలో తప్పనిసరి రిజిస్టర్లు ఉంచాలని సందీప్ శాండిల్య చెప్పారు. ఇందులో స్పాలకు వచ్చే వారి పేరు, ఫోన్ నంబర్లను విధిగా నమోదు చేయాలని ఆదేశించారు. స్పాలలో బెడ్ల వాడకం అవసరం లేదన్నారు.సాధ్యమైనంత వరకూ క్రాస్ మసాజ్‌కు అనుమతించవద్దని అన్నారు.

Category
🗞
News