• 7 years ago
TDP MPS Galla Jayadev and Rammohan Naidu talk about BJP poll promises. Ram Mohan Naidu and Galla Jayadev expressed their concern over Government's assurance over Bifurcation Act

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అసంబద్దంగా జరిగిందని, ఏపీ ప్రయోజనాలకు కావాల్సిన కేటాయింపులు కేంద్ర బడ్జెట్‌లో లేవని టీడీపీ ఎంపీలు, నేతలు అన్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం, ఎంపీ గల్లా జయదేవ్ రామ్మోహన్ నాయుడు తదితరులు మీడియాతో మాట్లాడారు.
విభజన తర్వాత ఏపీ ఏదైతే కోల్పోయిందో దానిని కేంద్రం సమకూర్చాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. తాము ఎన్డీయేలో ఉన్నప్పటికీ, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజల కోరిక మేరకు నడుచుకున్నామన్నారు. విభజన చట్టంలోని 19 అంశాలపై స్పష్టత లేదన్నారు. విభజన తర్వాత కోలుకోవాలనే విభజన చట్టం చేశారని బీజేపీని ఎద్దేవా చేశారు. అందుకే మిత్రపక్షంగా ఉన్నా పార్లమెంటులో పోరాడామన్నారు. చంద్రబాబు ఇంకా ఎన్నిసార్లు ఢిల్లీ రావాలన్నారు.
గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ఏపీ తలసరి ఆదాయం తక్కువగా ఉందని చెప్పారు. విభజనతో చాలా ఆస్తులు కోల్పోయామని చెప్పారు. ఏపీలో పరిస్థితి చక్కబడే కేంద్రం ఆధుకోవాలన్నారు. పన్నుల్లో మినహాయింపుతో పాటు ఇన్‌సెంటివ్స్ ఇవ్వాలన్నారు. బీజేపీ మద్దతుతోనే విభజన బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. విభజన సమయానికే రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందన్నారు. ఏపీకి నష్టం జరిగితే సహించేది లేదన్నారు.
దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి మద్దతిస్తున్నాయని గల్లా జయదేవ్ అన్నారు. ఇప్పుడు ఇది జాతీయ ప్రధాన అంశమైందని చెప్పారు. బీజేపీ మోసం చేస్తుందా అని అన్ని పార్టీలు అనుమానంగా చూస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనకు కేంద్రం ఎప్పుడు, ఏమి ఇస్తుందో టైమ్ లైన్ ఇవ్వాలన్నారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఏపీకి వచ్చే వరకు ఆదుకోవాలన్నారు.

Category

🗞
News

Recommended