• 7 years ago
Anushka Shetty‘s Bhaagamathie was one of the most exciting Telugu releases of the year and looks like it has started off with a bang. The Horror Thriller doing well all over South in Telugu, Tamil and Malayalam versions.

హీరోల ఆధిపత్యం నడిచే సౌత్ చిత్ర పరిశ్రమలో ఒక హీరోయిన్ సినిమాల పరంగా, కలెక్షన్స్ పరంగా వారి రేంజిని అందుకోవడం చాలా అరుదు. ఇన్నేళ్ల పరిశ్రమ చరిత్రను తిరగేసినా ఇలాంటి వారి సంఖ్య చాలా తక్కువ. ఈ తరంలో అలాంటి అతితక్కువ మందిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు అనుష్క శెట్టి. ప్రస్తుతం అనుష్క నటించిన 'భాగమతి' చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. భాగమతి చిత్రం జనవరి 26న విడుదలైన సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద ఎవరూ ఊహించని వసూళ్లు సాధిస్తూ దూసుకెలుతోంది. ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ. 25 కోట్ల మార్కును అందుకుంది.
తెలుగు సినిమాల విషయంలో తొలి రోజు రూ. 10 కోట్లు వసూలు చేయడం అంటే ఓ రేంజి స్టార్ హీరోకే సాధ్యం. అయితే అనుష్క నటించిన ‘భాగమతి' చిత్రం తొలి రోజు రూ. 12 కోట్లు వసూలు చేయడంతో ట్రేడ్ వర్గాలు పరేషాన్ అవుతున్నాయి.ప్రవాసులు ఎక్కువగా ఉండే అమెరికా లాంటి దేశాల్లో క్రేజ్ సంపాదించుకోవడం అంటే అంత సులభం కాదు. ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికే అక్కడి మార్కెట్‌ను క్యాచ్ చేయడం సాధ్యం కాలేదు. కానీ చాలా మంది స్టార్ హీరోలకు సాధ్యం కాని క్రేజ్ అనుష్క సొంతం చేసుకుంది.
అమెరికాలో ‘భాగమతి' చిత్రం తొలి రోజున 1,56,538 డాలర్లను వసూలు చేసింది. ప్రస్తుతం అమెరికాలో పోటీలో ఇతర సినమాలు ఏమీ లేక పోవడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఫుల్ రన్ లో ఈచిత్రం 1 మిలియన్ మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

Recommended