• 7 years ago
They are wife and husband, they had a son. But in husband's absence his wife maintained a illicit relationship with other person. Husband catched her with the help of cctv footage and asked her for divorce. Finally Court granted divorce for him and ordered police to file the case against his wife and her lover.
భర్త డ్యూటీపై వెళ్లగానే భార్య మరో వ్యక్తితో గుట్టుగా అక్రమ సంబంధం సాగిస్తోన్న ఉదంతమిది. అయితే ఆమె రాసలీలలు భర్త అమర్చిన రహస్య సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగుచూశాయి. ఈ ఘటన మహారాష్ట్ర పూణే నగరంలోని అంబేగామ్ ప్రాంతంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... పూణే నగరానికి చెందిన ఓ యువకుడు ఓ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 2007 మార్చిలో ఓ యువతితో హిందూ సంప్రదాయం ప్రకారం అతడికి వివాహమైంది. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే అతడికి తన భార్య వ్యవహారశైలిపై అనుమానం వచ్చింది. ఇదిలా ఉండగా, అతడి భార్య ఓ రోజు ఇంటి నుంచి పారిపోయి మూడురోజుల తర్వాత తిరిగివచ్చింది. భర్తతో కొట్లాడి వేరు కాపురం పెట్టించడంతోపాటు ప్రతి విషయంలో ఆమె భర్తతో గొడవపడుతుండేది. తాను పాఠశాలకు వెళ్లిన తర్వాత రోజూ తమ ఇంటికి మరో వ్యక్తి వస్తున్నాడని తన కుమారుడి మాటల ద్వారా గ్రహించిన భర్త తన భార్య ఆటకట్టించాలని నిశ్చయించుకున్నాడు.

Category

🗞
News

Recommended