• 7 years ago
Interesting news on Mahesh Babu 25th movie title. Fans hungama in social media
#MaheshBabu
#25thmovietitle

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రతిభగల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరెకెక్కిస్తున్నారు. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. భరత్ అనే నేను చిత్రం తరువాత మహేష్ తదుపరి చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే మహేష్ తన దర్శకులని ఎంపిక చేసుకుంటున్నారు. వంశీ పైడిపల్లి చిత్రం తరువాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. కాగా మహేష్ 25 వ చిత్రం గురించి సోషల్ మీడియాలో అప్పుడే హంగామా మొదలైంది.
భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం సాధించింది. తన తదుపరి చిత్రాలు అభిమానులకు మరింత వినోదాన్ని పంచేలా మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. భరత్ అనే నేను ముఖ్యమంత్రిగా కనిపించిన మహేష్ నెక్స్ట్ మూవీలో ఎలాంటి రోల్ లో కనిపించబోతున్నాడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు సంయుక్త నిర్మాణంలో మహేష్ 25 వ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్ర షూటింగ్ ని జూన్ నుంచి ప్రారంభించబోతున్నారు. భరత్ అనే నేను చిత్రం తరువాత మహేష్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

Recommended