తూర్పు కనుమల్లో బయటపడిన అరుదైన కప్పలు

  • last month
Rare Frogs Found in Eastern Ghats : అనేక వింతలు, విశేషాలకు భూమి పుట్టినిల్లు. అందులో జీవవైవిధ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పుడమిపై ఇంకా మనకు తెలియని అరుదైన జీవజాలం ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో అరుదైన జాతికి చెందిన రెండు కప్పలను పరిశోధకులు గుర్తించారు. రానా గ్రాసిలీస్ అని పిలిచే గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్, శ్రీలంక బ్రౌన్ ఇయర్డ్ ష్రబ్ ఫ్రాగ్‌గా పిలిచే సూడోఫిలౌటస్ రేజియస్‌ను గుర్తించారు. ఇవి రెండు ప్రపంచంలో ఒక్క శ్రీలంకలో మాత్రమే కనిపిస్తాయి. కానీ తొలిసారిగా భారత్‌లో వీటి ఉనికి బయటపడింది. మరి, వాటిని ఎలా గుర్తించారు? జీవ వైవిధ్య పరంగా భారత్‌కు శ్రీలంక మధ్య సంబధమేంటి? ఇప్పుడు చూద్దాం.

Recommended