• last year
Fires In Damagundam Forest Area : వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు అంటుకుంది. దీంతో అడవిలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అయితే మంటలకు కారణాలు తెలియరవడంలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి అడవిలో మంటలను గమనిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు, అటవీ, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఇటీవల అటవీ ప్రాంతాన్ని నేవీ రాడార్‌ అధికారులు మ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎంతమేర అటవీ ప్రాంతం నష్టమైంది అనే విషయాన్ని అధికారులు తేల్చాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Category

🗞
News
Transcript
01:00To be continued...

Recommended