దేవుడా.. అమలాపాల్ అదేంపని..!

  • 7 years ago
Amala Paul and Fahadh Faasil have been accused of tax fraud, cheating and forgery. Two film actors have been booked for allegedly forging documents and getting their vehicles registered in the union territory of Puducherry to evade motor vehicle tax in Kerala.

సినీ నటులు అమలాపాల్, పహద్ ఫాజిల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. కేరళలో పన్ను తప్పించుకోవడానికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారనే ఆరోపణలపై వీరిపై పాండిచ్చేరి పోలీసులు కేసు నమోదు చేశారు. అమలాపాల్, ఫాజిల్‌ కేసులో ఇరుక్కోవడం తమిళ, మలయాళ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. పోలీసుల తెలిపిన ప్రకారం..
రూ.20 లక్షలకు పైగా ధర పలికే విలాసవంతమైన కార్లపై 20 శాతం పన్ను తప్పించుకోవడానికి పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో అమలాపాల్, ఫాజిల్ తప్పుడు పత్రాలు సృష్టించారు. కేరళకు చెందిన వీరిద్దరూ కేరళలో కార్లను కొనుగోలు చేసి పాండిచ్చేరిలో రిజిస్టర్ చేశారు. అందుకోసం కొన్ని సర్టిఫికెట్లను ఫోర్జరీ చేశారు అని పోలీసుల వెల్లడించారు.
కేసు నమోదు అయినందున్న అమలాపాల్‌, ఫాజిల్‌ను త్వరలోనే క్రైం బ్రాంచ్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే వీరికి నోటీసులు పంపినట్టు సమాచారం. కొద్దిరోజుల్లో అమలపాల్‌, ఫాజిల్ క్రైం బ్రాంచ్ అధికారుల ముందుకు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది అని ఓ పత్రిక కథనాన్ని వెల్లడించింది.
అందాల తార అమలపాల్ రూ. 1.75 లక్షలు చెల్లించి ఎస్ క్లాస్ బెంజ్ కారును లోన్‌పై తీసుకొన్నారు. అయితే పాండిచ్చేరిలో ఉమేశ్ పేరిట ఉన్న ఓ ఇంటిలో కిరాయికి ఉంటున్నట్టు చూపే పత్రాలను ఆమె సమర్పించారు. ఇదే అడ్రస్ నుంచి చాలా మంది ప్రముఖులు కార్లను రిజిస్టర్ చేసుకొన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.

Recommended