• 8 years ago
Film Nagar source said that, "Nela Ticket" title is almost confirmed for Ravi Teja's next film, which is going to be a village-based entertainer. This movie will be directed by 'Soggade Chinni Nayana' fame Kalyan Krishna.


నేల టికెట్... ఈతరం జనరేషన్ వారికి పరిచయం లేక పోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో నేలటికెట్ తీసేసి చాలా ఏళ్లయింది. అయితే నిన్నటితరం సినీ ప్రేక్షకులకు నేల టికెట్ సుపరిచితమే. దీని గురించి అంతా మరిచిపోతున్న తరుణంలో హీరో రవితేజ మళ్లీ గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ‘టచ్‌ చేసి చూడు' చిత్రం చేస్తున్న రవితేజ తన తర్వాతి మూవీ కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘నేల టికెట్' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కళ్యాణ్ కృష్ణ గతంలో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
‘నేల టికెట్' టైటిల్ వినడానికి విచిత్రంగా ఉందని, రవితేజ నుండి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు అని దీని గురించి చర్చించుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో, సినిమా బ్యాగ్రౌండ్ తో ఈ చిత్రం సాగనుందని తెలుస్తోంది.
రవితేజ-కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ప్రారంబోత్సవం జనవరి 5వ తేదీ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రానికి ‘నేల టికెట్' టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పెడతారా? అనేది అప్పుడే ఓ క్లారిటీ రానుంది.
‘నేల టికెట్' చిత్రంలో నివేథా థామస్‌ను హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.

Category

🗞
News

Recommended