• 7 years ago
Popular singer Ghazal Srinivas got arrested in a Case. A Radio jacky was filed a complait on Srinivas. Victim is working as a Program Head in a Web radio at Punjagutta in Hyderabad. Police took him into custody basing on the complaint. According to the report, Ghazal Srinivas is running a web radio Aalaya Vani. A woman named Kumari is working as program head in that web radio.
లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు చర్యలు తీసుకొన్నట్టు సమాచారం. ఆలయవాణి అనే వెబ్‌ రేడియో చానెల్‌ను గజల్ శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు. గజల్ శ్రీనివాస్ అరెస్ట్ వార్త మీడియాలో సంచలనంగా మారింది.
మీడియా కథనాల ప్రకారం.. ఆలయ ఆఫీస్‌లో కుమారి అనే మహిళ రేడియో జాకీగా, ప్రొగ్రాంహెడ్‌గా పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా తనను వేధిస్తున్నట్టు కుమారి డిసెంబర్ 29న ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.

Recommended