• 7 years ago
Yadav community warns Rangasthalam team. The lyrics of the recently released song Rangamma Mangamma got problem with ‘Yadav’ community. they objected ‘Gollabhama Vachi Gorugillutunte’ lines

రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రం మార్చ్ 30 న ప్రపంచ వ్యాప్తంగా ఘనమైన విడుదలకు సిద్ధం అవుతోంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేసే పనిలో ఉంది. ఇప్పటికే విడువులైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో అట్టహాసంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రంగస్థలం చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో రంగస్థలం చిత్రంలోని సాంగ్ వివాదంలోచిక్కుకుంది, దీనితో చిత్ర యూనిట్ షాక్ తింది.
రంగస్థలం చిత్రంలోని సాంగ్స్ వినసొంపుగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. అయితే దేవిశ్రీ మరో మారు తన పనితనం చూపించాడు. ఈ చిత్రంలోని రంగమ్మ మంగమ్మ అనే సాంగ్ అయితే యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ కొల్లగొడుతోంది. తాజాగా ఈ పాట వివాదంలో చిక్కుకుంది. రంగమ్మ మంగమ్మ సాంగ్ లోని ఓ లిరిక్ యాదవ కమ్యూనిటీ మహిళల మనో భావాలకు వ్యతిరేకంగా ఉందని ఆ కమ్యూనిటీ నాయకుడు రాములు యాదవ్ పేర్కొన్నారు.
ఇంతకీ ఆ లిరిక్ ఏంటి అనగా రంగమ్మ మంగమ్మ అనే సాంగ్ లో 'గొల్ల భామ వచ్చి గోరుగిల్లుతుంటే' అనే లిరిక్ తమ మహిళల మనోభావాలకు వ్యతిరేకంగా అందని దానిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేసారు. అయితే ఆ లిరిక్ ని తొలగించకుంటే రంగస్థలం చిత్రంపై ఫిర్యాదు చేస్తామని, విడుదల కానివ్వకుండా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. దీనిపై రంగస్థలం చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.

Recommended