• 7 years ago
Yesterday morning,Kamau heard commotion in the pig’s house and when he went to check what was going on, he found out the pig was delivering. He helped it deliver successfully but was shocked the young one resembled a baby boy.Villagers assembled to get a clear view of the new born and in two good hours they couldn’t figure out whether it was a human being or a pig.Mr Kamau was left with the pig and is wondering what to do with it.Who could be behind this?!!!
#viralpiglikebaby
#pigman
#piggivesbirthhuman
#ViralVideo

పంది కడుపున మనిషి పుట్టాడంటూ.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోలు మీరూ చూసే ఉంటారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి ఈ అరుదైన సంఘటన తెలంగాణంలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలోని విరారెడ్డిపల్లిలో చోటు చేసుకుందంటూ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఘటన కెన్యాలోని మురంగాలో చోటు చేసుకున్నట్లు తెలిసింది. అక్కడ ఉన్న పందులశాల(పిగ్ ఫాం)లోని ఓ పందికి... మనిషి రూపంలో ఉన్న పంది పిల్ల జన్మించినట్లు సమాచారం. అయితే, ఇది కూడా ఎంతవరకు వాస్తవం అనేది కూడా అనుమానమే. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో అది బొమ్మలా కదులుతోంది. శుక్రవారం చంద్రగ్రహణం కావడంతో ఈ వింత చోటు చేసుకుందని, బ్రహ్మంగారు చెప్పిన మాట నిజమైందంటూ ఎవరికి తోచిన ప్రచారం వారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరో కావాలనే అలాంటి బొమ్మను తయారు చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇటీవల కొందరు ఆకతాయిలు కోతులకు గ్రహాంతరవాసి వేషం వేసి నమ్మించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇది కూడా అవాస్తవం కావచ్చని ఈ వీడియో, ఫొటోలు చూసినవారు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజాలే అని నమ్మొద్దు. కొందరు ఆకతాయిలు ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసి జనాలను భయపెట్టి ఆనందం పొందుతారు.

Category

🗞
News

Recommended