Skip to playerSkip to main contentSkip to footer
  • 2/2/2018
Actor-composer Vijay Antony will don khaki for the first time in his upcoming action drama Roshagadu, which was officially announced on Thursday with a poster.

రోషగాడు' ఈ పేరు వినగానే మెగాస్టార్ చిరంజీవి 1983లో నటించిన చిత్రం గుర్తుకు వస్తుంది. చిరంజీవి, మాధవి, సిల్క్ స్మిత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈచిత్రానికి అప్పట్లో కెఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. అయితే త్వరలో 'రోషగాడు' పేరుతో మరో సినిమా రాబోతోంది.
‘బిచ్చగాడు' సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోనీ త్వరలో ‘రోషగాడు' అనే టైటిల్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ప్రస్తుతం విజయ్ ఆంటోనీ తమిళంలో ‘తిమురు పుడిచావన్' అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నాడు ఈ చిత్రానికి తెలుగులో ‘రోషగాడు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఫిబ్రవరి 7వ తేదీ నుండి 'రోషగాడు' సినిమా మొదలు కానుంది. గణేశ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ అనే విషయం పోస్టర్ ను బట్టి తెలుస్తోంది.
విజయ్ ఆంటోని ఇంతకుముందు చేసిన సినిమాకి చిరంజీవి పాత్ర పేరైన 'ఇంద్రసేన' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇపుడే ఏకంగా చిరంజీవి టైటిలే తన సినిమాకు పెట్టుకోవడంతో ఈ తమిళ ‘బిచ్చగాడు' తెలుగు మెగాస్టార్‌ను బాగా వాడేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Recommended