కలరా నియంత్రణకు భారత్​ బయోటెక్​ వ్యాక్సిన్

  • last month
Bharat Biotech Launched Hillchol Vaccine : ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికా సహా అనేక దేశాల్లో కలరా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. 2021 తర్వాత ఈ బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ తీవ్రత మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కలరా నియంత్రణకు హైదరాబాద్ ఫార్మా దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ ఓరల్ వ్యాక్సిన్​ని అందుబాటులోకి తెచ్చింది. వెల్కమ్ ట్రస్ట్, హిలమెన్ ల్యాబరేటరీస్​తో కలిసి 'హిల్‌కాల్' పేరుతో వ్యాక్సిన్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది.

ఈ మేరకు హైదరాబాద్​ నగరంలోని ఓ హోటల్​లో జరిగిన కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా, వెల్కమ్ ట్రస్ట్ నుంచి జులియా కెంప్, కలరా వ్యాక్సిన్ల పితామహుడిగా పేరొందిన డాక్టర్ జాన్ హోల్మెగ్రెన్, కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు ప్రొఫెసర్ విజయ్ రాఘవన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

నోటి ద్వారా ఇచ్చే హిల్​కాల్​ వ్యాక్సిన్​ : ప్రపంచవ్యాప్తంగా 2023 నుంచి ఇప్పటి వరకు 8,24,479 మందికి కలరా సోకగా 5,900 మరణాలు సంభవించాయని గణాంకాలు చెబుతున్నాయని భారత్​ బయోటెక్​ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. అయితే వ్యాధి అంతకంతకూ పెరుగుతున్నా వ్యాక్సిన్లు మాత్రం ఆ స్థాయిలో అందుబాటులో లేవని ఆవేదన చెందారు.

ఈ నేపథ్యంలో హిల్ కాల్ వ్యాక్సిన్​ని అందుబాటులోకి తెచ్చినట్లు భారత్​ బయోటెక్​ ప్రకటించిందన్నారు. నోటి ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్​ సింగిల్​ స్ట్రెయిన్​ వ్యాక్సిన్​ కావటం విశేషం. ఇది మొత్తం రెండు డోసులలో వ్యాక్సిన్​ ఇవ్వాల్సి ఉంటుంది. తొలిడోస్​ ఇచ్చిన 14 రోజుల తర్వాత రెండో డోస్​ ఇవ్వాల్సి ఉంటుందని భారత్​ బయోటెక్​ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.

Category

🗞
News
Transcript
00:00Probably say, two out of three children are vaccinated with the Indian vaccines.
00:07Two out of four children are vaccinated with the Hyderabad vaccines, globally.
00:12So that shows the commitment of Hyderabad as a Telangana, what it contributes to things.
00:17And I think we are a strong believer of intellectual property protection.
00:21And I'm a champion, right for the last 20 years, I've been a champion on that, on IPR issues.
00:26And we are the only company in the developing world have done efficacy trial.
00:31Many people do the immunobridging trial, but not the efficacy trial.
00:35Rotavirus, we're the first one in the world, developing world, to do the efficacy trial.
00:40Thanks to Indo-US lab program, bilateral program,
00:43where we involved almost 65 scientists globally involved in the Rotavirus project.
00:48I think I will say, UNICEF wants to have eradicate by 2030, cholera-free world.
00:54And I think we want to be part of that game of anything can be contributed.
00:58As a company, our vision was, how do we work on neglected disease?
01:02That's our mission, as a vision project, as a neglected disease.
01:05Somebody asked me, why do you want to work neglected disease when there is no money available?
01:09So the reason is, we work on neglected, because most of the neglected are in Asia and Africa.
01:14And that neglected disease is what turns into pandemic.
01:17You look at all the pandemic, all comes from the neglected disease.
01:20This new vaccine now also gives the world the opportunity to realize
01:27the World Health Organization's strategy for ending cholera by 2030.
01:35This strategy has not been realistic for as long as the global manufacturing capacity
01:41was limited to current 40 million doses per year.
01:45Because the real need for vaccine is at least 150 million doses per year
01:51and more likely 200 million doses per year.
02:15For African countries and certain Middle Eastern countries,
02:21where there is a lot of prevalence of cholera,
02:25it is very necessary for such countries.
02:29For international agencies like WHO,
02:33they have a complete picture of the world endemic regions.
02:38We also have experts in Bangladesh and other Eastern parts of our country
02:43who say that there is a disease burden.

Recommended