• 8 years ago
Police thinking to Potency test for Rajesh, who beats wife at first night in Chittoor Distict on Friday Night.

శాడిస్ట్ భర్త రాజేష్‌కు (26) పొటెన్సీ టెస్ట్ (నపుంసక పరీక్షలు) చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు మూడో అదనపు జిల్లా కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. కోర్టు అనుమతితో అతనికి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.
రాజేష్‌‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఇప్పటికే పోలీసులు తెలిపారు. నూతన వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.టెస్టులో రాజేష్ సంసార సుఖానికి పనికిరాడని తెలిస్తే మరిన్ని అతనికి మరిన్ని చిక్కులు వస్తాయి. సంసారానికి పనికి రానని తెలిసి పెళ్లి చేసుకోవడమే కాకుండా, తొలిరాత్రి భార్యకు నరకం చూపించినందుకు అతనిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు కానున్నాయి.

Category

🗞
News

Recommended