• 6 years ago
Pawan Kalyan's latest war was has given unexpected advantage to Vijayawada YCP leader Yangaveeti Radha. That made it possible to get what he wanted.
రాజకీయాల్లో అంతే! ఎక్కడో ఏదో జరుగుతుంది...కానీ దాని పర్యవసానం ఫలితం...ఊహించని విధంగా ఎవరిదో కొంప కొల్లేరవుతుంది...అంతేకాదు అనూహ్యంగా మరొకరు అందలం ఎక్కడం కూడా జరగొచ్చు...ఇది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో అనేకసార్లు కనిపించిన సత్యం. అయితే తాజాగా ఎపి రాజకీయ పార్టీల్లోనూ ఒక వ్యవహారం అనేక పార్టీలను అనేక రకాలుగా ప్రభావితం చేస్తోంది. ఆయా పార్టీల నేతల తలరాతలు మారుస్తోంది. ఇంతకీ ఆ వ్యవహారం ఏమిటంటే?... అది పవన్ కళ్యాణ్ తాజా యుద్దం...దాని ప్రభావం వివిధ పార్టీల మీద ఉన్నా...మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం వైసిపి నేత వంగవీటి రాధాకు...ఈ వ్యవహారం ఎలా కలిసొచ్చిందనేదే!...పవన్ పరోక్షంగా ఈ బెజవాడ కాపు నేత నెత్తిన పాలు ఎలా పోసాడా అనేదే!...
అసలు విషయాని వస్తే ముందు రాధాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దనుకున్నారు... ఆ తరువాత రాధా అడిగే చోట ఎమ్మెల్యే టికెట్ వేరేవారికిచ్చి ఆ తరువాత ఎమ్మెల్సీనో, మంచి నామినేటెడ్ పదవో ఇద్దామనుకున్నారు(అధికారంలోకి వస్తే)...కానీ తాజాగా సమీకరణాలన్నీ రివర్స్ అయ్యాయి.

Category

🗞
News

Recommended